Rajamouli : రజినీకాంత్ కమల్ ను కలిపి సినిమా.. మనసులోమాట బయటపెట్టిన జక్కన్న..!

Rajamouli : రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ గడ్డపై సగర్వంగా నిలబెట్టి పేరు తెచ్చాడు.దర్శక ధీరుడు రాజమౌళి మొట్టమొదటిసారి అంచనాలకు మించి అతి మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.

ఇక ఆర్ఆర్ఆర్ తెలుగు తో పాటు హిందీ,తమిళ,మలయాళం, కన్నడం లో విడుదలయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదలయి చరిత్ర సృష్టిస్తోంది. అటు ఇండియా లోని ప్రేక్షకులనే కాకుండా వరల్డ్ వైడ్ గా అందరిని ఆకట్టుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే సోషల్ మీడియా మొత్తం హోరేత్తిపోతోంది. ఇక ఈ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా కాబట్టి ప్రమోషన్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని రాజమౌళి తన హీరోలిద్దరిని తీసుకొని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయడం విశేషం. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఆలోచనలో ఉన్న మరొక మల్టీ స్టారర్ ఐడియా గురించి కూడా చెప్పడం జరిగింది. తమిళం ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని ముఖ్యంగా రజనీకాంత్ కమల్ హాసన్ వంటి వారు కలిసి నటిస్తే కనులవిందుగా ఉంటుంది అని చెప్పాడు. ఎవరో ఒకరు నెగెటివ్ రోల్ లో, మరొకరు పాజిటివ్ పాత్రలో చూపించి సినిమాను వెండి తెర పైకి తీసుకు వస్తే అద్భుతంగా ఉంటుంది అని, తన మైండ్లో ఆ ఆలోచన నిత్యం ఉంటుంది అని అన్నారు.చూడాలి మరీ ఈ కాంబినేషన్ సెట్ అయి సినిమా పడితే ఇంకెలా ఉంటుందో..