Raj Tharun: స్టాండ్ అప్ రాహుల్ ఓటిటి విడుదల ఎప్పుడంటే..?

Raj Tharun: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఉయ్యాలా జంపాలా సినిమాతో రంగ ప్రవేశం చేసి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన హీరో రాజ్ తరుణ్. కుమారి 21 ఎఫ్ సినిమా తో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. రాజ్ తరుణ్ పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం అవుతున్నా ‘ఉయ్యాల జంపాల’, ‘కుమారి 21ఎఫ్’, సినిమాలు తప్ప ఇక ఏ సినిమాలు అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల వచ్చిన అనుభవించు రాజా సినిమా కూడా ఈ కోవలోనే కలిసిపోయింది.దీంతో రాజ్ తరుణ్ తన పద్ధతి మార్చుకొని స్టాండ్ అప్ రాహుల్ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నీ మూటకట్టుకుంది.

స్టాండ్ అప్ రాహుల్ సినిమా థియేటర్లో ప్రేక్షకుల ను మెప్పించకపోయినా, ఓటిటి లో అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఆహా ఓటిటి సంస్థ స్టాండ్ అప్ రాహుల్ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 8న ఆహా ఓటిటి సంస్థ స్ట్రీమింగ్ తారీకును ఫిక్స్ చేసింది.