వైరల్ : ఏలియన్ తో రెహమాన్ బిజీ బిజీ..!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న తమిళ భారీ సినిమా “అయలాన్” కూడా ఒకటి. దర్శకుడు కె ఎస్ రవికుమార్ అలాగే యంగ్ హీరో శివ కార్తికేయన్ కాంబినేషన్ లో ఇండియన్ సినిమా దగ్గర ఓ మోషన్ క్యాప్చర్ సినిమాగా ఇది వస్తుంది.

అయితే దీనికి ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రాగా దీని తర్వాత ఐతే ఇంకా ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ చిత్రం వస్తుంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ కూడా రాగా మేకర్స్ ఇప్పుడు ఓ అప్డేట్ ని టీజర్ కోసం ఇచ్చారు. మరి ఈ టీజర్ ని ఈ అక్టోబర్ 6 రిలీజ్ కి ఫిక్స్ చేశారు.

అయితే దీనిపై ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఓ ఆసక్తికర అప్డేట్ ని అందించాడు. తాము ఇప్పుడు తమ ఏలియన్ చిత్రం అయలాన్ టీజర్ లాస్ట్ పనుల్లో తాము బిజీగా ఉన్నామని తెలిపాడు. అయితే ఇందులో పెట్టిన హైలైట్ అయ్యింది అని చెప్పాలి.

ఇందులో తాను హీరో శివ కార్తికేయన్ సహా తమతో తమ సినిమాలో కనిపించే ఏలియన్ తో కూడా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళతో పాటుగా ఆ ఏలియన్ కూడా సినిమా వర్క్స్ లో బిజీగా ఉందని కనిపిస్తుంది. దీనితో ఈ సినిమాపై అందరిలో మరింత ఆసక్తి పెరుగుతుంది. కాగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.