అయ్యో పాపం రాశీఖన్నా.. పండుగ రోజు ఎంత కష్టమొచ్చింది!!

Raashi Khanna

మామూలుగా ఎవ్వరైనా సరే పండుగ రోజు ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అన్ని రోజులు ఎలా గడిచినా పండుగ మాత్రం సరదాగా గడవాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, ఇంట్లో ఉండి కాసింత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. సెలెబ్రిటీలైనా సామాన్య జనాలైనా పండుగ నాడు కోరుకునేది ఇదే. కానీ రాశీ ఖన్నాకు మాత్రం ఈ పండుగ వింత అనుభవాన్ని ఇచ్చిందట. ఆ విషయాన్నే తలుచుకుని తెగ బాధపడుతోంది.

అసలే రాశీ ఖన్నా ఈ మధ్య దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఫోటో షూట్లతోనే ఈ రేంజ్‌లో వైరల్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. హాట్ హాట్ ఫోటోలతో వైరల్ అయిందంటే కామన్.. కానీ అందమైన చీరకట్టులో దిగిన ఫోటోలు కూడా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మళ్లీ దసరా స్పెషల్‌గా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. అవి కూడా నెట్టింట్లో అగ్గి రాజేశాయి. ఇలా ఫోటో షూట్లతోనే సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Raashi Khanna Working For Tughlaq Durbar On Dussehra
Raashi Khanna Working For Tughlaq Durbar On Dussehra

ఇక రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో ఒక్క ప్రాజెక్ట్‌లోనూ కనిపించడం లేదు. ప్రస్తుతం రాశీ చేతిలో కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు బాగానే ఉన్నాయి. తాజాగా రాశీ ఖన్నా విజయ్ సేతుపది తుగ్లక్ దర్బార్ షూటింగ్‌లో బిజీగా ఉంది. షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు, సెట్‌లో సందడి గురించి చెబుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే దసరా రోజున కూడా వీరు షూటింగ్ చేశారట. దీంతో రాశీ ఖన్నా బెంగటిల్లింది. పండుగ రోజు కూడా పని చేయాల్సి వచ్చింది.. మిక్స్‌డ్ ఫీలింగ్ అంటూ మొహం అదోలా పెట్టేసింది.

Raashi Khanna Working For Tughlaq Durbar On Dussehra
Raashi Khanna Working For Tughlaq Durbar On Dussehra