నాకేం తక్కువ.! రాశీఖన్నా గుస్సా.!

విన సొంపుగా పాడగలను. ప్రేక్షకుల మెప్పు పొందేలా నటించగలను. కామెడీ కూడా చక్కగా చేయగలను.. నాకేం తక్కువ.! అంటోందట అందాల భామ రాశీఖన్నా.

అసలు రాశీఖన్నా తన గురించి ఇలా చెప్పుకోవల్సిన అవసరమేమొచ్చిందట. అవునులెండి.! ఒకప్పుడు రాశీఖన్నా స్టార్ హీరోయినే. కానీ, ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. సో, ఇలా చెప్పుకు తిరగాలిలెండి.!

ఇంతకీ అసలు విషయమేంటంటే.! ఈ మధ్య ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా విషయమై చిత్ర యూనిట్ రాశీ ఖన్నాని సంప్రదించిందట. అయితే, రెమ్యునరేషన్ విషయంలో షాకింగ్ ఫిగర్ చెప్పిందట రాశీ ఖన్నా.

దాంతో, సదరు నిర్మాణ సంస్థ అంత సీను లేదు.. అందులో సగం కూడా ఎక్కువే.. కాదు కాదు పావు వంతు కూడా చాలా చాలా ఎక్కువే అని రాశీ ఖన్నా ఇజ్జత్ తీసేశారట.

దాంతో, ‘నాకేం తక్కువ.!’ అని రాశీ ఖన్నా గుస్సా అయ్యిందట. ఓ కొత్త దర్శకుడు తీసుకొచ్చిన సబ్జెక్ట్ అట ఇది. సబ్జెక్ట్ నచ్చింది రాశీఖన్నా సైన్ చేసిందట. అయితే, రెమ్యునరేషన్ విషయంలోనే టెర్మ్స్ అండ్ కండీషన్స్ సెట్ కావడం లేదనీ తెలుస్తోంది.

థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే సినిమా ఇది. ఓ నాలుగైదు రోజులు ట్రైనీ షూట్ చేశాకా, రాశీఖన్నాని ఈ సినిమా కోసం కొనసాగించాలా.? వద్దా.? అని సదరు చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వస్తుందట.

నిజమే, రాశీఖన్నా గుస్సా అయ్యే పరిస్థితే ఇది. అన్నట్లు రాశీఖన్నా ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది.