బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న రాశీ ఖన్నా!

Raashi Khanna

క్రేజీ బ్యూటీ రాశీకన్నా బాయ్‌ఫ్రెండ్‌ గురించి టాలీవుడ్ అంతా గుస గుసలాడుకుంటోంది. ఎవ్వరి నోటా విన్నా ఇదే మాట. తను తాజాగా ఒప్పుకున్న ఓ చిత్రంలో కూడా బాయ్‌ఫ్రెండ్‌ దొరక్క ఇబ్బందులు పడే అమాయకపు అమ్మాయి పాత్రలో నటించడానికి  సై అందట. 

Raashi Khanna
Raashi Khanna

ఆమెది ఈ చిత్రంలో డేటింగ్‌ యాప్ లోనూ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ప్రయత్నాలు మొదలెట్టే క్యారక్టర్ అట.  మరి బాయ్‌ఫ్రెండ్‌ దొరికాడా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్సు. ‘నేను తొలిసారి డేట్‌కి వెళ్తున్నాను’ అంటూ  సాగే ఈ క్యారక్టర్ పై రాశీకన్నాఎన్నో ఆశలు పెట్టుకుందట.

ఇదిలా ఉండగా  ఇటీవల ఓ సందర్భంలో కలిసినప్పుడు రాశీకన్నాను  ‘మీ బాయ్‌ఫ్రెండ్‌ అతడేనటగా.   టాలీవుడ్ అంతా గుస గుసలాడుకుంటోంది మీ  బాయ్‌ఫ్రెండ్‌ గురించే’ అని అడిగితే ‘అతడెవరో మీరు చెబితే నేనూ ట్రై చేస్తాను’ అంటూ తెలివిగా తప్పించుకుంది!?