నేను రెడీ.. మీరు రెడీయా అంటున్న రాశి ఖన్నా!

Raashi Khanna

షూటింగ్ లు  ఆపేసి ఎన్నోరోజులైంది. ఇప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదు. అక్కడక్కడా చిన్న సినిమాలు మొదలైనా కూడా పెద్ద వాళ్లు మాత్రం ఇంకా అడుగు బయటికి పెట్టడం లేదు. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో.. కరోనా ఎక్కడ్నుంచి దాడి చేస్తుందో తెలియక.. అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. బతికుంటే బలిసాకు తిందాంలే అన్నట్లు ఇంటి నుంచి బయటికి రావడం లేదు.

Raashi  Khanna
Raashi Khanna

డిసెంబర్ తర్వాతే పూర్తి స్థాయి షూటింగ్ లు ఉంటాయని అంటున్నారు. స్టార్ హీరోల అయితే కరోనా పోయేంత వరకు కూడా మేం బయటికి రామంతే అంటూ బిగుసుకు కూర్చున్నారు. దాంతో పెద్ద సినిమాల షూటింగ్ లు  అన్నీ అలాగే ఆగిపోయాయి.అక్కడక్కడా ఒకరిద్దరు బయటికి వస్తున్నా కూడా.. కరోనా అటాక్ చేస్తుండటంతో ..షూటింగ్ అనేది మరిచిపోతున్నారు సినిమా వాళ్లు.

ఈ క్రమంలోనే కొందరు తారలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అందులో రాశీఖన్నాకూడా ఒకరు. తాను షూటింగ్ చేసుకోడానికి రెడీ.. మీరు రెడీయా అని సవాల్ చేస్తోంది.. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలున్నాయి.  ఈ రెండు సినిమాల్లో ఏది సెట్‌పైకి వచ్చినా.. తాను కాల్షీట్ ఇవ్వడానికి, షూటింగ్‌కు రావడానికి సిద్ధమే అని అంటోంది రాశీఖన్నా. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె బయటకు రావట్లేదు .పూర్తిగా ఇంటికే పరిమితమైంది. దాంతో ఇప్పుడు షూటింగ్సు చేయడానికి తను మానసికంగా.. శారీరకంగా కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. మరి రాశీ సిద్ధంగానే ఉన్నా.. మన దర్శక నిర్మాతలు, హీరోలదే ఆలస్యం..