ఇంకా తగ్గని పుష్పా క్రేజ్.. క్రికెట్ స్టేడియంలో కూడా సమంత స్పెషల్ సాంగ్?

అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా అల్లు అర్జున్ రష్మికకి మంచి పేరు సంపాదించింది. వీరితోపాటు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంతకు సైతం ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 8 నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఈ సినిమా విడుదలైన మొదట్లో ఎక్కడ చూసినా ఈ సినిమాలో పాటలు డైలాగులు వినిపించేవి. ఇక సోషల్ మీడియాలో సైతం ఎంతోమంది పుష్ప సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను షేర్ చేశారు. అయితే ఈ సినిమా విడుదలై ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

ఇకపోతే తాజాగా వెస్టిండీస్ తో భారత్ t20 సిరీస్ లో పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్లోరిడాలోని క్రికెట్ స్టేడియంలో ఏకంగా సమంత నటించిన ఊ అంటావా మావ అనే పాట పెట్టడంతో ఒక్కసారిగా ఇండియన్ క్రికెటర్స్ పెద్ద ఎత్తున ఈ పాటకు చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నారు.