సంక్రాంతి సందర్బంగా విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన అనంతపురం పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ వివాదం వల్ల ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఫలితంపై గట్టి ప్రభావమే కనిపించే అవకాశం ఉంది. పుష్ప-2కు పలు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం, గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.
మిడ్‌నైట్ షోల అనుమతి లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీంతో బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల రోజున టికెట్ రేట్లు పెంచుకోవడానికి పరిమిత అనుమతులు ఇచ్చినప్పటికీ, పుష్ప-2తో పోల్చితే గేమ్ ఛేంజర్‌కు చాలా తక్కువ మినహాయింపులు కల్పించబడినట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు కేవలం 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయల పెంపు మాత్రమే అనుమతించబడింది.
మొదటి రోజు 6 షోల వరకు అనుమతి ఇస్తూ, మరుసటి తేదీ నుంచి షోల సంఖ్యను 5కు పరిమితం చేశారు. పుష్ప-2కు 20 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు ఇచ్చిన ప్రభుత్వం, గేమ్ ఛేంజర్‌కు కేవలం 10 రోజుల పాటు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించడం వల్ల వివాదం తలెత్తింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేక అనుమతుల విషయంలో మరింత గట్టి నియంత్రణలు అవసరమని భావిస్తున్నారు.
ఈ పరిణామాలతో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు, సినిమాకు ఉన్న అంచనాలను అందుకునే విధంగా మద్దతు తీసుకురావడంలో విజయవంతమయ్యారు. కానీ పుష్ప-2తో పోల్చినప్పుడు ఈ నిర్ణయాలు కమర్షియల్ గా బిజినెస్ విషయంలో ప్రభావం చూపుతాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.