బొమ్మరిల్లు భాస్కర్‌కి కలిసొచ్చిన ‘ఆరెంజ్’ రీ-రిలీజ్.!

‘భలే మంచి సినిమా తీశాడే..’ అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది ఓ సినిమా గురించి. అది మరేదో కాదు.. అప్పుడు ఫ్లాప్ లిస్టులో పడేసి, క్రిటిక్స్‌తో దారుణంగా విమర్శలకు గురైన ‘ఆరెంజ్’ సినిమా గురించి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కి సంబంధించి. చరణ్ కెరీర్‌లో తొలి డిజాస్టర్ ‘ఆరెంజ్’. అయితే, అది అప్పుడు.

కానీ, ఇప్పుడు.. క్రిటిక్స్ కూడా ‘ఆరెంజ్’ గురించి కొత్తగా మాట్లాడుతున్నారు. నిర్మాత నాగబాబు హ్యాపీ. కానీ ఈ సినిమా అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాలేదంటున్న బొమ్మరిల్లు భాస్కర్.

భాస్కర్ గురించిన పాజిటివ్ డిస్కషన్ నేపథ్యంలో ఆయనతో సినిమాలు తీసేందుకు స్టార్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ముందుకొస్తున్నారట. ఇదో విచిత్రం.! అన్నట్లు అప్పటికీ ఇప్పటికీ మ్యూజికల్ హిట్ చిత్రం ‘ఆరెంజ్’.