“గుంటూరు కారం” సాంగ్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్.!

రానున్న రోజుల్లో టాలీవుడ్ సినిమా దగ్గర మంచి కేజ్రిగా ఎదురు చూస్తున్న సాలిడ్ కాంబినేషన్ లలో దర్శకుడు త్రివిక్రమ్ ఇంకా మహేష్ బాబు ల కాంబినేషన్ లో వస్తున్నా హ్యాట్రిక్ సినిమా “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తుండగా సినిమా నుంచి మేకర్స్ కూడా ఒకో అప్డేట్ ని అయితే రివీల్ చేస్తున్నారు.

మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు అన్నీ కూడా నిన్న వచ్చిన ఓ సాంగ్ ప్రోమో తగ్గించేసింది అని కొన్ని కామెంట్స్ వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమాతో మెయిన్ గా మాస్ ఆడియెన్స్ సహా మహేష్ ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ ఇస్తున్నట్టుగా ఇప్పటివరకు మేకర్స్ చేసిన ప్రతి పని హిట్ అయ్యింది.

కాగా నిన్న వచ్చిన మూడో ప్రోమోలో కూర్చి మడతపెట్టి అనే లైన్ పట్ల సోషల్ మీడియాలో చాలా మంది రచ్చ చేశారు. త్రివిక్రమ్ మహేష్ ల నుంచి ఇలాంటిది ఊహించలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ అసలు దీని బ్యాక్ స్టోరీ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రివీల్ చేసాడు.

ప్రతిదానిలో నెగిటివ్ ఎందుకు చూస్తున్నారు అని ఈ సాంగ్ లో మహేష్ గారు కుర్చీ మడత పెట్టి డాన్స్ చేశారు అంతే కదా పాజిటివ్ గా ఆలోచించండి అంటూ ట్వీట్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ సాంగ్ విషయంలో వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అలాగే వచ్చే ఏడాది జనవరి 12 నుంచి రిలీజ్ కి రాబోతుంది.