Kashmir files : 10కోట్లా బడ్జెట్ తో తెరకెక్కిన ఒక సాధారణ సినిమా అసాధారణ విజయాన్ని అందుకుంది. ఏమాత్రం స్టార్ హీరోలు హడావిడి ప్రచార ఆర్భాటాలు లేని సినిమా ఇండియా మొత్తం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రమే ది కాశ్మీర్ ఫైల్స్.ఈ సినిమాలో ముఖ్యంగా కాశ్మీర్ పండితుల ఊచకోతలను ప్రధానంగా కథగా మలిచారు. చరిత్ర సాక్ష్యంగా జరిగిన కాశ్మీరి పండితుల ఊచకొతలను చూపింది ఈ సినిమా.
ఈ సినిమా బడ్జెట్ 10కోట్లు అయితే వసూలు చేసింది మాత్రం 200కోట్లు. స్వయంగా దేశ ప్రధాని ఈ సినిమా ను మెచ్చుకోవడం విశేషం. ఇక చాలా మంది సాధువులు ఒక సినిమా ను వీక్షించడం మరో అరుదైనా ఘటన. చాలా రాష్ట్రాలు ఈ సినిమా కోసం టాక్స్ ఫ్రీ చేసాయి. ఇక కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సినిమా చూడడానికి సెలవు ఇచ్చారు.1990లో కశ్మీరీ పండిట్‌లు ఎదుర్కొన్న నాటి పరిస్థితులని హృదయాన్ని కదిలించేలా తెరపై ఆవిష్కరించారు. నిజాయితీగా చెప్పిన ఈ కథ కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది.
ఇక ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్ నిర్మాతలు. కాశ్మీర్ ఫైల్స్ ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో మానవ చరిత్రకు సంబంధించిన మరో రెండు గొప్ప నిజాయితీ కథలను వెండితెరపై చూపించేందుకు సమాయత్తం అవుతున్నారు. అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు చిత్రాల ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇక అభిషేక్ అగర్వాల్ తెలుగులో కార్తికేయ 2 మరియు రవితేజ తో టైగర్ నాగేశ్వర్రావు అనే పీరియడిక్ డ్రామా ను నిర్మిస్తున్నారు.