ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ తో సీనియర్ హీరోయిన్స్ కి చెక్ పెట్టాలనుకంటే ఇలా జరిగిందేంటీ ..?

ప్రియమణి..ఎవరే అతగాడు అన్న సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన పరుత్తివీరన్ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవార్డ్ అందుకుంది. ఇక జగపతి బాబు హీరోగా నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో నటించిన ప్రియమణి.. నితిన్, గోపిచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి సక్సస్ లను సొంతం చేసుకుంది.

Priyamani returns to Telugu cinema; to star in a supernatural thriller |  Telugu Movie News - Times of India

అయితే పెళ్ళి చేసుకున్న ప్రియమణి గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఇటీవల మొదలు పెట్టిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయింది. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు అద్భుతమైన సినిమాలని ఎంచుకుంది. అందులోను ఆ రెండు సినిమాలు దగ్గుబాటి హీరోలవి కావడం..ఆ రెండు సినిమాలకి సురేష్ బాబు నిర్మాత కావడం విశేషం.

Narappa: Priyamani's First Look Poster Released – Bioscope

తమిళ అసురన్ రీమేక్ నారప్ప లో విక్టరీ వెంకటేష్ కి జంటగా నటిస్తున్న ప్రియమణి.. రానా దగ్గుబాటి సరసన కూడా నటిస్తుంది. సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విరాటపర్వం అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశర్య క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1992 ల నాటి పీరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Interesting first look of Priyamani from Virataparvam - Gossiper

అయితే సెకండ్ ఇన్నింగ్స్ తో సీనియర్ హీరోల కి జంటగా వరసగా అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలకి సరైన హీరోయిన్స్ దొరకడం లేదు. చెప్పాలంటే ఈ సీనియర్ హీరోలకి హీరోయిన్స్ సమస్య బాగానే ఉంది. ఈ క్రమంలో ప్రియమణి కి సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వస్తుందనుకుంటే కరోనా దెబ్బ కొట్టింది. ఇప్పటికే రిలీజవ్వాల్సిన నారప్ప, విరాటపర్వం సినిమాలు వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవడంతో ప్రియమణి ప్లాన్స్ కి బ్రేక్ పడింది.