దీపావళీ రోజున విడాకుల విషయం గురించి క్లారిటీ ఇచ్చిన ప్రియమణి …?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తన అందం , అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రియమణి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన ప్రియమణి ప్రస్తుతం సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

ఇలా ఒకవైపు సినిమాలు టీవీ షోలో మాత్రమే కాకుండా మరొకవైపు సిరీస్లలో కూడా నటిస్తూ అటు డిజిటల్ స్క్రీన్ కూడా తన సత్తా చాటుకుంటుంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ప్రియమని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్గా కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో ముస్తఫా అనే వ్యక్తిని ప్రియమణి ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే కొంతకాలంగా ప్రియమణి, ముస్తఫా ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తొంది.

అంతే కాకుండా విడాకులు కూడా తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రేమని ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. తాజాగా దీపావళి పండుగ రోజున ప్రియమణి సోషల్ మీడియా వేదికగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ క్రమంలో ప్రియమణి తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…” నా నుండి నా ఫ్యామిలీ నుండి మీకు దీపావళి శుభాకాంక్షలు “అంటూ చెబుతూ.. మిస్ యు ముస్తఫా అంటూ కోట్ చేసి..ఓ లవ్ సింబల్ పెట్టింది . ఇలా ఒక్క పోస్ట్ తో విడాకుల గురించి వస్తున్న వార్తలకు ప్రియమణి పులిస్టాప్ పెట్టింది.