రాజమౌళి అలా పాడు చేస్తాడు.. ప్రియమణి కామెంట్స్ వైరల్

Priyamani About Rajamouli In Yamadonga Set

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసింది. అలాంటి ప్రియమణి కెరీర్‌లో యమదొంగ సినిమాకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తనకు రాజమౌళి దేవుడు వంటివాడని చెప్పుకొచ్చిన ప్రియమణి జక్కన్నపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆయన లాంటి దర్శకుడిని ఎప్పుడూ చూడలేదని చెప్పింది.

Priyamani About Rajamouli In Yamadonga Set
Priyamani About Rajamouli In Yamadonga Set

ఆయన అంతా పాడు చేస్తాడని, ప్రేమతోనే స్పాయిలో చేసేస్తాడు.. అయితే అది మంచికే జరుగుతుందని చెప్పింది. ఆయన నటీనటులకు ఫ్రీడం ఇస్తారని చెప్పింది. ప్రతీ చిన్న విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటారని తెలిపింది. యమదొంగ షూటింగ్ సమయంలో జక్కన్న అన్న మాటలు, ఆయన ఇచ్చిన ఫ్రీడం గురించి ప్రియమణి చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాంటి దర్శకుడు ఎవ్వరికీ దొరకడని చెప్పింది.

రాజమౌళి వంటి దర్శకుడితో పని చేసే అవకాశం నాకు చాలా త్వరగా దొరికిందని ప్రియమణి సంబరపడిపోయింది. తనను ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకున్నారని చెప్పుకొచ్చింది. యమదొంగ షూటింగ్‌కు మొదటి రోజే వేరే సినిమా సెట్ నుంచి వచ్చాను. అక్కడే అంతా అలిసిపోయి వచ్చాను. మొదటి రోజు చూసిన రాజమౌళి రెండో రోజు పిలిచి.. ‘నీకు మూడు రోజులు టైం ఇస్తున్నా.. ఎక్కడికైనా వెళ్లు ఎలాగైనా ఉండు.. షూటింగ్ ఆపేస్తాను.. మళ్లీ నువ్ వచ్చేసరికి మాత్రం ఫ్రెష్‌గా కనిపించాలి.. మొహంలో ఆ ఫ్రెష్ నెస్ కనిపించాలి ’అని అన్నాడట. అంత మంచి దర్శకుడు ఇంకెక్కడైనా ఉంటాడా? అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

Priyamani, Rajamouli, ప్రియమణి, రాజమౌళి