ఇంత చనువు ఏంటి ప్రీతమ్.. చిరంజీవి చిన్న కూతురినే అంతమాట అంటావా?

డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత స్పెషల్ డిజైనర్ అయిన ప్రీతమ్ సమంత విడాకులు ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలిచాడు. అందుకు గల కారణం సమంత ఇతనితో ఎంతో చనువుగా ఉండటమే కాకుండా సోఫాలో పడుకొని అతనిపై కాళ్ళు వేసుకొని ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అందుకే నాగచైతన్య విడాకులు ఇచ్చారని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రీతమ్ ఈ వార్తలపై స్పందిస్తూ తను సమంతని అక్క అని పిలుస్తాను అని మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.

Preetam | Telugu Rajyamమొత్తానికి సమంతా విడాకుల విషయం ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ప్రీతమ్ ఏదో ఒక విషయం ద్వారా ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈయన సమంతతో పాటు ఇండస్ట్రీలో రకుల్, అల్లు స్నేహారెడ్డి వంటి వారికి డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పలువురు సిని సెలబ్రెటీలతో ఈయనకే ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పవచ్చు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురి విషయంలో ప్రీతమ్ చేసిన కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పుట్టినరోజు కావడంతో ఆమె పుట్టినరోజుకు ప్రీతమ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే శ్రీజ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడంతో అది చూసిన ప్రీతమ్ సుందర్ లడ్ కీ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కామెంట్ చూసిన పలువురు నెటిజన్లు మెగా కుటుంబంతో కూడా ఇంత చదువు ఏంటి ప్రీతమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles