‘జై హనుమాన్’.! ఆ హీరో ఏ ‘వుడ్డు’కి చెందినోడో.!

‘హనుమాన్’ సూపర్ డూపర్ హిట్ అవడంతో, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ సినిమాకి కొనసాగింపు ‘జై హనుమాన్’ పనుల్లో వేగం పెంచుతున్నాడు. ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ బిగిన్స్.. అంటూ నిన్ననే ప్రకటన కూడా చేశాడు.

అయితే, ‘జై హనుమాన్’లో హీరో తేజ సజ్జ కాదనీ, హనుమంతు పాత్రలోనే అతను కనిపిస్తాడనీ, ‘జై హనుమాన్’లో హనుమంతుడే హీరో అనీ, ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని ఎంపిక చేస్తామనీ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ వర్మ.

టాలీవుడ్‌లో ‘హనుమాన్’ని తలపించే స్టార్ హీరో ఎవరున్నారబ్బా.? అని, ప్రోబబులిటీస్ అప్పుడే చెక్ చేసేస్తున్నారు సినీ జనాలు, సినీ మీడియా ప్రతినిథులూ.!

అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హనుమంతుడ్ని వేరే ‘వుడ్డు’.. అదేనండీ, వేరే సినీ పరిశ్రమ నుంచి తీసుకురావాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

‘హనుమాన్’ సాధించిన విజయం దరిమిలా, ‘జై హనుమాన్’కి పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ రావాలంటే, హనుమంతుడి పాత్రలో పాన్ ఇండియా నటుడ్నే ఎంపిక చేయాలా.? అంతేనేమో.!

అన్నట్టు హనుమాన్ 200 కోట్ల గ్రాస్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన విషయం విదితమే.