ఇది మామూలు ప్రమోషన్స్ కాదు.. రాజమౌళిని మించిపోయిన ప్రశాంత్ నీల్!!

Prashanth Neel Creates Hype of KGF Chapter 2 Teaser

ఓ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఏ సమయంలో ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఎలా చేస్తే సినిమాపై అందరి దృష్టి పడుతుందనే విషయాలన్నీ కూడా రాజమౌళికి బాగా తెలుసు. అలాంటి రాజమౌళి మాట వల్లే కేజీయఫ్ రెండు బాగాలుగా ఇప్పుడు మన ముందుకు వస్తోంది. లేదంటే కేజీయఫ్ మొత్తాన్ని మొదటగా ఒకే భాగంలో చుట్టేశారు. అలా రాజమౌళి సలహాతో రెండు పార్టులుగా ఈ చిత్రం వచ్చింది.

Prashanth Neel Creates Hype of KGF Chapter 2 Teaser
Prashanth Neel Creates Hype of KGF Chapter 2 Teaser

అలా రాజమౌళి నుంచి ప్రమోషన్స్ ఎలా చేయాలో విద్యను అభ్యసించినట్టున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తన కేజీయఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్‌ను వీర లెవెల్‌లో చేసేస్తున్నాడు. జనవరి 8న యశ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ టీజర్‌ను వదలబోతోన్నారు. ఇప్పటికే ఈ మేరకు కొన్ని పోస్టర్లను వదిలారు. అయితే ఆ టీజర్‌పై ఇంకా ఆశలు, ఆసక్తిని పెంచేలా తాజాగా మరి కొన్ని పోస్టర్లను వదిలాడు. టీజర్‌పైనే అందరి దృష్టి పడేలా అదిరిపోయేలా డిజైన్ చేశారు.

ఇందులో రాకీ భాయ్ గురించి పేపర్‌లో వార్తలు వచ్చినట్టున్నాయి. రాకీ భాయ్ రాక్షసత్వం, ప్రేమ, ప్రేయసి, అమ్మ ప్రేమ ఇలా అన్ని చెబుతూ.. ఎటు వైపు మొగ్గుతాడు.. రాకీ దేన్నీ ఎంచుకుంటాడు..? ప్రేమనా లేక అధికారాన్నా? ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ బ్రతుకుతుందా? జాదుగాడు తన ప్రేయసిని పొందగలడా? అని రకరకాల ప్రశ్నలు మెదిలేలా చేశాడు. వీటికి జనవరి 8న టీజర్‌తో సమాధానం చెబుతాను అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ టీజర్ జనవరి 8న ఉదయం పది గంటల 18 నిమిషాలకు రానుంది.