ప్రశాంత్‌ వర్మ తదుపరి సినిమా ‘అధీర’

ప్రశాంత్‌ వర్మ.. ఇప్పుడిది పేరు కాదు ఒక బ్రాండ్‌. తీసింది నాలుగు సినిమాలు మాత్రమే. కానీ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల ఈ దర్శకుడి నుండి వచ్చిన మూవీ ‘హనుమాన్‌’. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తో హనుమంతుని బ్యాక్ డాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే సూపర్‌ కలెక్షన్స్‌ రాబడుతూ దూసుకుపోతోంది. దీంతో ప్రశాంత్‌ వర్మ నుండి వస్తున్న తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు.. ‘హనుమాన్‌’ తరువాత ప్రశాంత్‌ ఎలాంటి సినిమా చేస్తున్నాడు? మళ్ళీ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తోనే వస్తున్నాడా? అలా అయితే ఈసారి వస్తున్న సూపర్‌ హీరో ఎవరు? ఆ సినిమాలో హీరోగా ఎవరు చేస్తున్నారు? అంటూ తెగ సర్చింగ్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ప్రశాంత్‌ వర్మ తరువాత సినిమాను కూడా సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తోనే తీయబోతున్నారట. ఆల్రెడీ ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. ఇంట్రో వీడియో కూడా రిలీజ్‌ అయ్యింది. ఆ సినిమానే ‘అధీర’.

ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్‌ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు. ‘అధీర’ సినిమా కోసం లైట్‌ను సూపర్‌ హీరో పవర్‌ గా తీసుకోనున్నారు ప్రశాంత్‌ వర్మ. తనకున్న లైటింగ్‌ పవర్‌ తో ఆ సూపర్‌ హీరో ఏం చేశాడు అనేది ‘అధీర’ కథ.

ఈ సినిమాకు సంబంధించ ఇప్పటికే షూటింగ్‌ మెదలైందని ప్రశాంత్‌ వర్మ చెప్పారు. ఇక ‘అధీర’కి సంబంధించిన ఇంట్రో వీడియో చూశాక..ఈ సినిమా కూడా ‘హనుమాన్‌’ రేంజ్‌ లో ఆడియన్స్‌ ను మెస్మరైజ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా 2024 ఇయర్‌ ఎండింగ్ లో వచ్చే అవకాశం ఉంది. మరి మాములు బ్జడెట్‌ తోనే ‘హనుమాన్‌’ లాంటి గొప్ప సినిమా తీసిన ప్రశాంత్‌.. ఇప్పుడు ఏ రేంజ్‌ సినిమా తీస్తాడో అని ఆడియన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు.