Appudo Ippudo Eppudo: ప్రదీప్‌ తాజా చిత్రం.. ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’

Appudo Ippudo Eppudo: యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి.. హీరోగా మారిన వారి జాబితాలో ముందు వరుసలో ఉంటాడు ప్రదీప్‌ మాచిరాజు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమాతో హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్‌. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

ప్రదీప్‌కు హీరోగా మంచి మార్కులే పడ్డాయి. చాలా రోజుల తర్వాత రెండో సినిమాను ప్రకటించేశాడు ఈ స్టార్‌ యాంకర్‌. ప్రదీప్‌ ఈ సారి పవన్‌ కల్యాణ్‌ సినిమా టైటిల్‌పైనే కన్నేశాడు. ప్రదీప్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్‌ నెట్టింటిని షేక్‌ చేస్తోంది.

Akkada Ammayi Ikkada Abbayi: ప్రదీప్ మాచిరాజు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫస్ట్ లుక్

ఓ వైపు అందమైన ఊరు, మరోవైపు ఆయుధాలు చేత బట్టిన గ్రామస్థులు, క్లాస్‌ రూంలో ప్రదీప్‌, ఇంట్లో హీరోయిన్‌ కనిపిస్తున్న విజువల్స్‌తో కట్‌ చేసిన మోషన్‌ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం ప్రేమ కథ నేపథ్యంలో ఉండబోతుందని హింట్‌ ఇచ్చేసినట్టు మోషన్‌ పోస్టర్‌ చెబుతుండగా.. మేకర్స్‌ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మోంక్స్‌ అండ్‌ మంకీస్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇ.ఏ రాధన్‌ సంగీతం అందిస్తున్నాడు. నితిన్‌ భరత్‌ స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.

నా ఊపిరి ఉన్నంతవరకు మాట తప్పను || YS Jagan EMOTIONAL Speech At Key Meeting With Ysrcp Leaders || TR