కొరియోగ్రాఫర్‌గా కెరియర్ మొదలు పెట్టిన ప్రభుదేవా నటుడిగా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభుదేవా నయనతారతో ప్రేమ విషయంలో చాలా హాట్ టాపిక్‌గా మారాడు. 1995లో రామలతని వివాహం చేసుకున్న ప్రభు 2011లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ సమయంలో వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నయనతార వలననే ఈ ఇద్దరు విడిపోయారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది.
నయనతారతో బ్రేకప్ తర్వాత తన కెరియర్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన ప్రభుదేవా గత ఏడాది సల్మాన్ తో దబాంగ్ 3 అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం రాధే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కరోనా వలన ఆగిన ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. కట్ చేస్తే ప్రభుదేవా ఓ అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ప్రభుదేవా పెళ్ళి చేసుకున్న అమ్మాయి డాక్టర్ అని సమాచారం.
ప్రభుదేవా కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీని నుండి ఉపశమనం పొందేందుకు డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లిగా కూడా మారిందని టాక్. ప్రభుదేవా ఎవరికి తెలియకుండా సీక్రెట్ పెళ్లి చేసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంచలనంగా మారిన ప్రభుదేవా పెళ్ళిపై ఏదైన అఫీషియల్ ప్రకటన వస్తుందా అనేది చూడాలి.