Prabhas : ప్రభాస్ ను పెళ్లి చేసుకొని ఒకరోజు బ్రతికినా చాలు అంటున్న బిగ్ బాస్ భామ…!

Prabhas : ఆర్జీవీ ‘నగ్నం’ మూవీతో హీరోయిన్‌గా మారి తెలుగు బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిసిన బోల్డ్‌ బ్యూటీ శ్రీరాపాక.రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలో సందడి చేసిన ఈ భామ రెండోవారమే ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చేసింది. బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ లు మాములే. ఇక ఈ బోల్డ్ బ్యూటీ కూడా వరుస ఇంటర్వ్యూ లతో బిజీ గా ఉంది.

శ్రీరాపాక ప్రభాస్ కు అభిమాని. అభిమానులు చాలా మందే ఉంటారు కానీ ఈ భామ మాత్రం ప్రతి ఇంటర్వ్యూ లోనూ ప్రభాస్ జపమే చేస్తోంది.ఇక ప్రభాస్ కు ఉన్న లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ ఒప్పుకుంటే పెళ్లికి రెడీ అంటూ ఎంతో మంది ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ మాత్రం ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు తాను కూడా చేసుకోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల ఓ యూ ట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రభాస్‌ పెళ్లిపై స్పందించింది. ప్రభాస్‌ నటించిన ఈశ్వర్‌ మూవీ బాగా ఇష్టమని, అప్పటి నుంచి ప్రభాస్‌ అంటే ఇష్టం అని చెప్పింది. మరి ఆయనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన ప్రశ్నకు అంతకంటే అదృష్టమా అని సమాధానం ఇచ్చింది. అనంతరం ప్రభాస్‌ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించిన చాలు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అయితే ఎలాగు అది జరగదు కాబట్టి ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్‌ చేస్తానని, ఆయన పెళ్లి తర్వాతే తను పెళ్లి పీటలు ఎక్కుతానని చెప్పేసింది . ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోకపోతే తాను కూడా ఎప్పటికీ పెళ్లి చేసుకోనని పేర్కొంది.