కృతి సనన్ ప్రభాస్ ప్రేమలో ఉన్నారు… అసలు విషయం బయటపెట్టిన వరుణ్ ధావన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా అనంతరం ఈయన వరుస సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈయన ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు తరచూ ప్రస్తావనకు తీసుకువస్తుంటారు.ఇక ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారనీ గతంలో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలను అనుష్క పూర్తిగా ఖండించారు.

ఇకపోతే తాజాగా బాలీవుడ్ నటి కృతి సనన్ తో కలిసి ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందని దీంతో వీధి ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కృతి సైతం ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పినటువంటి కామెంట్స్ మరింత సంచలనం రేపాయి. ఇకపోతే తాజాగా కృతి సనన్ వరుణ్ ధావన్ కలిసి నటించిన బేడియా చిత్రం విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక బాలీవుడ్ షోలో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వరుణ్ ధావన్ కృతి సనన్ ప్రభాస్ తో ప్రేమలో ఉందని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కృతి నీ గుండెలో ఎందుకు లేదు అంటూ ప్రశ్నించగా ఆమె మరొకరి గుండెల్లో ఉంది. ప్రస్తుతం ఆయన ముంబైలో లేరు…. దీపికా పదుకొనేతో కలిసి వేరే ప్రాంతంలో షూటింగ్లో పాల్గొంటున్నారు అంటూ ప్రభాస్ గురించి పరోక్షంగా తెలియజేశారు.దీంతో వరుణ్ దావన్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.