ఇన్సైడ్ టాక్ : “NBK108” కి ఈ పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్.?

ప్రస్తుతం టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా తన కెరీర్ 108వ ప్రాజెక్ట్ కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం కన్నా ముందు బాలయ్య “వీరసింహా రెడ్డి” అనే తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకోగా ఈ సినిమా తర్వాత అయ్యితే దర్శకుడు అనీల్ రావిపూడితో స్టార్ట్ చేసిన ఈ సినిమా పై భారీ హైప్ ఇప్పుడు నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతూ ఉండగా ఈ చిత్రం టైటిల్ కోసం ఇప్పుడు పలు క్రేజీ వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి “భగవత్ కేసరి” అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది.

అయితే గతంలో ముందు “బ్రో ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా రూమర్స్ రాగా ఈ బ్రో టైటిల్ అయితే పవన్ సినిమాకి వెళ్లగా ఇప్పుడు మేకర్స్ ఈ కొత్త టైటిల్ ని అదే టాగ్ లో అయితే లాక్ చేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్ మొదలైంది. ఇక ఈ జూన్ లో బాలయ్య బర్త్ డే కాబట్టి అప్పుడు దీనినే అనౌన్స్ చేయనున్నారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా కీలక పాత్ర చేస్తుంది. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుంది.