C 202: పోస్టర్లు.. టీజర్‌.. ట్రైలర్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి!

C 202: మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్‌ రియా ఫెర్నాండెజ్‌ హీరోయిన్‌గా నటించారు. మైటీ ఒక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై మనోహరి కేఏ ఈ సినిమాని నిర్మించారు.

ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ‘సి 202‘ (C 202) చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్‌ను పొందింది. ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ పూర్తవ్వడంతో చిత్ర యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు.

‘సి 202’ (C 202) ట్రైలర్ విడుదల

అక్టోబర్‌ 25న విడుదల చేస్తునట్లు ఓ పోస్టర్‌ వదిలారు. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా సీన్స్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ తోనే భయపెట్టిన ఈ సినిమా.. మరి థియేటర్‌లో ఏ రేంజ్‌లో భయపెడుతుందో చూడాలి. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ కథతో వస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, సత్య ప్రకాష్‌, షఫీ, చిత్రం శీను, వై. విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు.

Prof. Kancha Ilaiah EXSPOSED Pawan Kalyan Politics With BJP & Modi || Chandrababu || Ys Jagan || TR