టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కి ఇప్పుడు సౌత్ సినిమాలలో విపరీతమైన డిమాండ్ ఉంది. పూజా హార్డ్ వర్కర్… డైరెక్టర్స్ హీరోయిన్.. మేకర్స్ కి, హీరోలకి లక్కీ హీరోయిన్. పూజా హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం నంబర్ 1 ప్లేస్ అంటే పూజా దే అని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్ఠి పెట్టింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో వరసగా రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.
అయితే పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో రాధే శ్యామ్ లో ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా యూరప్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు డ్యూయల్ రోల్ అన్న టాక్ కూడా ఉంది. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇడియన్ కటౌట్ పక్కన హీరోయిన్ గా అంటే ఇక పూజా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఒక వైపు ఇలా భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూనే మరోవైపు యంగ్ హీరో అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ లాంటి సినిమాలు చేస్తోంది. చెప్పాలంటే ఈ సినిమాకి పూజా నే మేయిన్ అని చెప్పుకుంటున్నారు. డైరెక్టర్ తో పాటు హీరో అఖిల్ కి సరైన సక్సస్ లేదు. ఇలాంటి సమయంలో ఫుల్ ఫాం లో ఉన్న పూజా ఈ సినిమాని ఒప్పుకొని డేరింగ్ స్టెప్ తీసుకోవడమే కాదు.. తన పర్ఫార్మెన్స్ తో సినిమా సూపర్ హిట్ అవడానికి కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో అఖిల్ తో పూజా చేసే రొమాంటిక్ సీన్స్ చాలా హైలెట్ కానున్నాయని.. యూత్ ఆడియన్స్ ని పూజ-అఖిల్ జంట బాగా ఆకట్టుకోవడం పక్కా అని అంటున్నారు. ఇక గతంలో అఖిల్ అన్న నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కాని ఆ సినిమా కథ ప్రకారం చైతూ-పూజా ల మధ్య అంతగా రొమాంటిక్ సీన్స్ లేవు. కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ యూత్ ని అట్రాక్ట్ చేసే రొమాంటిక్ సీన్స్ చాలానే ఉన్నాయంటున్నారు.