ఓహో పూజా హెగ్డే క్యారెక్టర్ అలాంటిదా?.. అరెరె బయటపడిందే!

Pooja Hegde Doing Stand Up Comedian Character In Most Eligible Bachelor

బుట్టబొమ్మ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు.. జాతీయ స్థాయిలో ఓ ఊపు ఊపేసింది పూజా హెగ్డే. ఇక పూజా హెగ్డే కాళ్లకు అల్లు అర్జున్ అంతటోడో ఫిదా అయిపోతే సాధారణ జనం మాత్రం కాకుండా ఉంటారా? వాళ్లు కూడా నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు.. అంటూ పాటలు పాడేస్తున్నారు. అల వైకుంఠపురములో చిత్రంతో ఒక్కసారిగా పూజా స్టార్డం పదింతలు పెరిగింది.

Pooja Hegde Doing Stand Up Comedian Character In Most Eligible Bachelor
Pooja Hegde Doing Stand Up Comedian Character In Most Eligible Bachelor

ఇక పూజా రాబోయే చిత్రాలతోనూ ఓ రేంజ్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ప్రభాస్ రాధేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలున్నాయి. ఇందులో ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సెట్స్ పైకి వచ్చింది. చాలా గ్యాప్ తరువాత షూటింగ్ మొదలెట్టిన ఈ యూనిట్ ఫుల్ జోష్‌లో ఉన్నట్టుంది. షూటింగ్ సెట్‌లో అఖిల్, పూజా తెగ సందడి చేస్తోన్నట్టు తెలుస్తోంది.

Pooja Hegde Doing Stand Up Comedian Character In Most Eligible Bachelor
Pooja Hegde Doing Stand Up Comedian Character In Most Eligible Bachelor

తాజాగా ఈ పూజా హెగ్డే షేర్ చేసిన ఓ ఫోటోతో ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ ఏంటో బయటపడింది. బొమ్మరిల్లు భాస్కర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పూజా హెగ్డే ఓ పోస్ట్ చేసింది. అందులో భాగంగా తన క్యారెక్టర్ గురించి రివీల్ చేసేసింది. ఇందుల్ స్టాండప్ కామెడీ చేసే అమ్మాయిగా పూజా నటించబోతోంది. అంటే అందర్నీ నవ్విస్తూ తన ప్రేమలో పడేసుకుంటుందేమో చూడాలి. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న భాస్కర్, అఖిల్‌కు ఈ చిత్రం కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.