‘స్కంద’లో మరికొన్ని కోణాలు !

ఏపీలోని రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా అందులో డైలాగ్స్‌ స్కంద ఎన్ని రోజులకు కేవలం మాస్‌ సినిమాగానే కనిపించింది.. కానీ రిలీజ్‌ కు దగ్గర పడుతుంటే ఇందులోని మరికొన్ని కోణాలు కూడా బయట వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో రాజకీయ రంగు చాలానే ఉందని తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా అందులో డైలాగ్స్‌ ఉన్నాయంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు విడుదలైన ట్రైలర్లో మొదటి డైలాగ్‌ కూడా అలాగే ఉంది. విూరు తప్పు చేశారని చట్టం ఒప్పుకోవచ్చు.. ధర్మం ఒప్పుకోవచ్చు.. కానీ దైవం ఒప్పుకోడు సార్‌ అనే డైలాగ్‌ తోనే ట్రైలర్‌ ఓపెన్‌ అయింది. ఆ తర్వాత ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి కొన్ని డైలాగ్స్‌ ఉన్నాయి. ఆత్మగౌరవం అంటూ రామ్‌ కూడా పెద్ద పెద్ద పదాలు వాడాడు.

పైగా ఈ సినిమా కథ కూడా ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌ అయిన శ్రీకాంత్‌.. అనుకోకుండా ఇద్దరు ముఖ్యమంత్రులకు శత్రువు ఎలా అవుతాడు.. తన నాన్న స్నేహితుడు అయిన శ్రీకాంత్‌ను రామ్‌ ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేది ఈ సినిమా కథ. రొటీన్‌ కథలాగే అనిపిస్తున్న ఇందులో పొలిటికల్‌ హంగులు చాలానే ఉన్నాయని కంటెంట్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది.

సాధారణంగా బాలకృష్ణ హీరోగా ఉన్న సినిమాల్లో ఎక్కువగా పొలిటికల్‌ పంచులు వేస్తుంటాడు బోయపాటి శ్రీను. సింహ, లెజెండ్‌, అఖండ లాంటి సినిమాలలో పొలిటికల్‌ డైలాగ్స్‌ ఓ రేంజ్‌ లో ఉంటాయి. అయితే ఇప్పుడు విచిత్రంగా రామ్‌ హీరోగా ఉన్న సినిమాలో కూడా పొలిటికల్‌ డైలాగ్స్‌ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫస్ట్‌ ట్రైలర్‌ కేవలం మాస్‌ ఆడియన్స్‌ కోసం కట్‌ చేసినట్టు అర్థమవుతుంది.

కానీ రెండో ట్రైలర్‌ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇందులో మాస్‌ ఉన్నా కూడా కంటెంట్‌ బలంగా ఉంది అనే విషయాన్ని చాలా బలంగా చెప్పాడు బోయపాటి శీను. సెప్టెంబర్‌ 28న సినిమా విడుదల కానుంది. మరి రాజకీయ రంగులు స్కంద సినిమాకు ఎంతవరకు హెల్ప్‌ అవుతాయో చూడాలి. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత సరైన విజయం లేని రామ్‌ ఈ సినిమాతో మరోసారి బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని కసితో ఉన్నాడు. బిజినెస్‌ కూడా దాదాపు 50 కోట్లు జరిగింది. పాన్‌ ఇండియా సినిమాగా స్కంద తెరకెక్కింది.