నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నటించిన చిత్రం 18 పేజెస్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజా బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలను అందుకోబోతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నిఖిల్ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు నిఖిల్ సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ ఈ సినిమా చేయడానికి మూడు సంవత్సరాలు సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం చెబుతూ కరోనాకు ముందే ఈ సినిమాని స్టార్ట్ చేసామని, అయితే రెండు లాక్ డౌన్స్ రావడం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోవడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి కంటెంట్ ఉన్న సినిమా కాదు అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయలేదని ఇకపై తాను నటించే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యే విధంగా చూసుకుంటానని తెలిపారు.
మరొక నెటిజన్ నిఖిల్ తో ముచ్చటిస్తూ సినిమా చాలా సూపర్ గా ఉంది అయితే క్లైమాక్స్ లో ముద్దు పెట్టే సీన్ చూస్తుంటే మాకు తొలిప్రేమ సినిమా గుర్తుకు వచ్చింది అని చెప్పడంతో వెంటనే నిఖిల్ దండం పెడుతూ దయచేసి మా సినిమాను తొలిప్రేమ సినిమాతో పోల్చకండి.మా సినిమా ద్వారా తొలిప్రేమ సినిమా గుర్తుకు వచ్చింది అది చాలు అందుకు థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
🙏🏽🙏🏽🙏🏽 Plz can’t be compared.. but I’m happy it reminded you of the Classic.
#AskNikhil #18Pages https://t.co/LCoYAkd8g7— Nikhil Siddhartha (@actor_Nikhil) December 26, 2022