Pushpa 2: ‘పుష్పా2’ నుంచి పీలింగ్స్‌ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

Pushpa 2: టాలీవుడ్‌, పాన్‌ ఇండియాతో పాటు వరల్డ్‌ వైడ్‌గా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2 ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్‌ మరోసారి టైటిల్‌ రోల్‌లో నటిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వరుస అప్‌డేట్‌లను ఇస్తుంది చిత్రబృందం. ఈ మూవీ నుంచి ఇప్పటికే ట్రైలర్‌తో పాటు మూడు పాటలను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో సాంగ్‌ను అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ మూవీ నుంచి పీలింగ్స్‌ అనే పాట ప్రోమోను పుష్ప టీమ్‌ తాజాగా విడుదల చేసింది. కొచ్చిలో జరిగిన మూవీ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ ఈ పాట గురించి అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఈ పాటలోని పల్లవి లిరిక్స్‌కు సంబంధించి అన్ని భాషల్లోనూ మలయాళంలోనే ఉండనున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న ఈ ప్రోమోను మీరు చూసేయండి.

అదానీ కాల్ చేసి చెప్పడా | Ys Jagan First Reaction On Adani Case issue | Chandrababu | Telugu Rajyam