ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తెలుగు రాష్ట్రాల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇందు పాత్రను ఇప్పటికే ఎవ్వరూ మరిచిపోలేదంటూ అది పాయల్ వేసిన ముద్ర ప్రభావమే. అయితే మళ్లీ ఆ స్థాయి హిట్ ఆమె ఖాతాలో పడకపోవడం కాస్త నిరాశ కలిగించే విషయమే. కానీ పాయల్ మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు. వరుసగా సినిమాలను చేస్తూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా గడిపేస్తోంది.
తెలుగులోనే ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఉండటంతో.. హైద్రాబాద్‌కే మకాం మార్చేసింది. పాయల్ పూర్తిగా తెలుగమ్మాయిల మారిపోవాలనే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఏకంగా తెలుగులో డబ్బింగ్ చేసేందుకు చాలా ఆరాట పడుతోంది. ఈపాటికే ఓ ప్రకటనలో తెలుగులో డబ్బింగ్ చెప్పేసింది. కరోనా, ప్లాస్మా దానంపై అవగాహన కలిగించే ప్రకటనలో పాయల్ నటించి, తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంది.
ఇక తాజాగా తన మేకప్ రూంలో చేసిన సందడిని వీడియో రూపంలో షేర్ చేసింది. పల్లెటూరి తెలుగమ్మాయి పాత్రను పోషిస్తోన్న పాయల్.. అందుకే తగ్గట్టే వేషధారణ చేసుకుంది. జడలో పూలు పెట్టుకుని అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. ఇక తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. బుల్లి స్కర్ట్ వేసుకుని హోయలొలికిస్తూ రచ్చ రచ్చ చేసింది. వెరైటీ వెరైటీ పోజులను పెడుతూ పాయల్ అందర్నీ కట్టిపడేసింది.