ఇన్సైడ్ టాక్ : ప్రశ్నార్థకంగా మారిన పవన్ ప్రతిష్టాత్మక సినిమా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో అలాగే తన రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒకింత ఎక్కువ పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉంటుండగా సినిమాల షూటింగ్స్ అర్ధం కాని పరిస్థితిలోకి మారాయి. అయితే ఆల్రెడీ “భవదీయుడు భగత్” సింగ్ చిత్రాన్ని పవన్ చేస్తానని అనౌన్స్ చేశారు అలాగే హరీష్ కూడా ఎప్పుడు ఈ సినిమా మొదలైనా మళ్ళీ పది కాలాల పాటు నిలిచిపోయేలా ఉంటుంది అని ప్రామిస్ ఇచ్చాడు.

ఇది ఎలాగో ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఆల్రెడీ సెట్స్ పై పవన్ భారీ సినిమా “హరిహర వీరమల్లు” పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ఈ సినిమా ఇంకా షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. పైగా ఈ అక్టోబర్ నుంచే పవన్ పొలిటికల్ గా భారీ టూర్ ని ప్లాన్ చేసుకున్నారు.

మరి ఈ గ్యాప్ లో పవన్ మరో రీమేక్ చేసే అవకాశం ఉందని టాక్ ఉంది. దీనితో వీరమల్లు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మరింత ఆసక్తిగా మారింది. అసలే పవన్ చాలా కాలం తర్వాత చేస్తున్న స్ట్రయిట్ ప్రాజెక్ట్ ఇది పైగా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కూడా ఇదే దీనితో ఫ్యాన్స్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఫైనల్ గా అయితే ఈ చిత్రం ఏమవుతుందో చూడాలి.