పవనా? మహేశా?? శ్రీలీల ఇంటెలిజెంట్ సమాధానం..!

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజీ అండ్ డిమాండ్ ఉన్న ఏకైక హీరోయిన్ అందులోని తెలుగు హీరోయిన్ శ్రీలీల. మొదటి సినిమా తర్వాత నుంచి వరుసగా భారీ ఆఫర్స్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరోయిన్ తన టాలెంట్ తో మెస్మరైజ్ చేసింది.

అంతే కాకుండా రీసెంట్ గా బాలయ్య సినిమా భగవంత్ కేసరిలో తన ఏక్షన్ పార్ట్ తో కూడా అందరికీ షాకిచ్చిన ఈమె టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయ్యిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు లతో కూడా ఆమె చేస్తుంది. మరి ఈ యంగ్ హీరోయిన్ కి ఈ ఇద్దరి విషయంలో ఓ టఫ్ ప్రశ్న ఎదురు కాగా.

“ఆదికేశవ” ప్రమోషన్స్ లో ఆమె సిహిన ఇంటెలిజెంట్ సమాధానం వైరల్ గా మారింది. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరితో వర్క్ చేస్తున్నావు ఇద్దరిలో ఎవరంటే నీకు ఇష్టం అంటే ఆమె తెలివిగా ఇద్దరి కోసం కూడా చెప్పకుండా ఇప్పుడు ఆదికేశవ ప్రమోషన్స్ లో ఉన్నాం దాని కోసమే చెప్పుకుందాం సినిమాలో పాటలు ఫైట్ లు అన్నీ బాగుంటాయి అని నాన్ స్టాప్ గా చెప్పుకొచ్చింది.

దీనితో ఓ హీరో పేరు చెప్తే ఇంకో హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఇలా దీనిని దృష్టిలో పెట్టుకొని శ్రీలీల చాలా చాకచక్యంగా సమాధానం ఇవ్వడం మాత్రం వైరల్ గా మారింది. ఇక ఈ ఆదికేశవ చిత్రంలో మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా ఈ నవంబర్ 24న విడుదల కాబోతుంది.