“భారత్” పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ సినిమా ప్రముఖ నటుడు అలానే రాజకీయ నాయకుడు ఓ పార్టీ అధ్యకుడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలు సినిమాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కూడా తాను ఒక భారతీయున్ని అని మాత్రం చాలా గర్వంగా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఏ స్పీచ్ చూసుకున్నా కూడా భారత మాతాకీ జై అని కానీ జై హింద్ అనే స్లోగన్ లు లేకుండా ఆ స్పీచ్ లు ముగియవు. అలా పవన్ ఎప్పటికప్పుడు తన దేశభక్తిని తాను చాటి చెప్పుకుంటాడు. అలా ఇండియా అనే దాని కన్నా భారత్ పేరుతోనే ఎన్నో ప్రసంగాలు చేశారు.

కాగా ఇదిలా ఉండగా ఇపుడు దేశం అంతా కూడా భారత్ అలానే ఇండియా అనే రెండు పేర్ల విషయంలో తీవ్ర వివాదంలో అయితే కొట్టుకుంటున్నాయి. మరి ఈ పేరు విషయంలో చాలా మంది భారత్ అనే పేరుకి కూడా మొగ్గు చూపుతూ ఉండగా ఈ పేరు విషయంలో పవన్ కళ్యాణ్ గతంలో సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి..

మనకి ఇండియా అనే పేరు బ్రిటిష్ వారు పెట్టింది అని కానీ మనది భారతదేశం మనం భారతీయులం అని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండియా అనే పేరు మార్పు విషయంలో మన టాలీవుడ్ సినిమా నుంచి చాలా మందే దీనిని షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇది ఎటెటు తీసుకెళ్తుందో చూడాలి.