టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రెండు సినిమాలు అయితే గ్యాప్ లేకుండా ఇపుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా పవన్ ఇపుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్ లో ఉండగా దీని షూట్ ని దర్శకుడు హరిశ్ శంకర్ మళ్ళీ గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ ఇచ్చేలా అయితే ప్లాన్ చేస్తున్నాడు.
తన వర్క్ పట్ల నమ్మకంగా ఉన్న హరీష్ ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రం మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ నుంచి ఎదురు దెబ్బలు తింటున్నాడు. సినిమా ఒక రీమేక్ అని పవన్ క్రేజ్ ని రీమేక్ లతో పాడు చేస్తున్నారని మొదటి నుంచి ఫ్యాన్స్ హరీష్ ని అయితే తిట్టి పోస్తున్నారు.
అయితే హరీష్ కూడా ఏమీ తక్కువ కాదు అందరికీ సమానంగా వెనక్కి ఇచ్చేస్తాడు. అయితే లేటెస్ట్ గా పవన్ ఫ్యాన్స్ హరీష్ ని మరింతగా హర్ట్ చేసేసారు. పవన్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బదులు సర్దార్ భగత్ సింగ్ అంటూ మాట్లాడడంతో..
పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవన్ కి పర్శనల్ గా ఓజి సినిమా అంటేనే ఇష్టం అని ఉస్తాద్ టీం ఫ్యాన్స్ అందరికీ ఇదొక హృదయ విదారక వార్త అంటూ ఫన్ గానే ట్రోల్స్ చేసుకున్నారు కానీ దీనికి దర్శకుడు హరీష్ మాత్రం బాగా హర్ట్ అయ్యినట్టు అనిపించింది. నవ్వుతూ పర్లేదు గుర్తు చేయడానికి గుర్తుండిపోయేలా సినిమా చేసేందుకు మేము ఎంతో కష్టపడుతున్నాం అంటూ హరీష్ రిప్లై ఇచ్చాడు. కాగా ఇదైతే ఇపుడు హరీష్ విషయంలో వైరల్ గా మారింది.
Hahaahha “humiliation “?? Woww what a word
పర్లేదు గుర్తు చేయడానికి,
గుర్తుండిపోయే సినిమా తీయడానికి,
మేమంతా కష్టపడుతున్నాం… https://t.co/gBeYhSxgRr
— Harish Shankar .S (@harish2you) October 24, 2023