టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడు తన సినిమాలు అలాగే రాజకీయాలు కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ చిత్రాల్లో అయితే ట్రెండ్ మారుతున్నప్పటికీ ఇంకా రీమేక్ సినిమాలు మీదనే పవన్ ఆధారపడుతూ ఉండడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.
ఇది అందరికీ తెలిసిన అంశం. అయితే పవన్ కి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న ఒకే ఒక్క దగ్గర వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శకుడు త్రివిక్రమ్ అనే అందరికి తెలుసు. అయితే ఆల్ మోస్ట్ పవన్ కి రీమేక్ చిత్రాలు సజెస్ట్ చేస్తుంది త్రివిక్రమ్ నే అని పవన్ తో ఆ సినిమాలు చేసిన సదరు నిర్మాతలే బాహాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
కాగా ఇప్పుడు బ్రో విషయానికి వస్తే ఈ సినిమా ఓపెనింగ్స్ యావరేజ్ గా రాగ ఇక సోమవారం వసూళ్లు అయితే దారుణంగా వచ్చాయి. పావన డిజాస్టర్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞ్యాతవాసి చిత్రాల మధ్యలో బ్రో నిలవడం విశేషం. ఇక దీనితో ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది అసలు పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఈ రీమేక్ చిత్రాలు సజెస్ట్ చేయకూడదు అని పవన్ క్రేజ్ ని మార్కెట్ ని తగ్గించేస్తుంది త్రివిక్రమే అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఇంకా చాలా మంది మరీ ఘోరంగా అంటున్నారు అలాగే పవన్ సినిమాల్లో తాను ఇన్వాల్వ్ అవుతూ త్రివిక్రమ్ బాగానే డబ్బులు వెనకేసుకుంటున్నాడు అని ఇప్పుడు కూడా రీమేక్ చిత్రాలు పవన్ కి తగిలించి పవన్ స్టార్డం ని దెబ్బ తీస్తున్నాడు అని అంటున్నారు. దీనితో ఇప్పుడు రచ్చ మాత్రం మాములుగా లేదు..