మెగాస్టార్ టైటిల్ తో పవర్ స్టార్ మూవీ !

పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే , మరోవైపు సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్‌ తెలుగులో రీమేక్ లో నటిస్తున్నాడు.

Chiranjeevi's Concern for Pawan Kalyan

సాగర్ కె.చంద్ర డైరెక్షన్ లో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కతున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ 40 రోజులు కేటాయించినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు చేసిందట చిత్రబృందం. కాన్సెప్ట్ కు తగ్గట్లు ఈ సినిమాకి ‘బిల్లా రంగా’ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించారు. ఇక బిల్లాగా పవర్ ‌స్టార్, రంగాగా రానా నటించనున్నారు. కాగా 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది.