పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కీ రిలీజ్ డేట్ లాక్ చేసిన దిల్ రాజు ..!

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రస్తుతం ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. జనవరి వరకు ఈ షెడ్యూల్ జరగనుండగా శృతి హాసన్, పవన్ కళ్యాణ్ సహా ప్రధాన తారాగణం పాల్గొంటున్న సన్నివేశాలని కంప్లీట్ చేస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరాం. ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాలలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తుండగా థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ సినిమా చూసి మూడేళ్ళు కావడం తో ప్రతీ ఒక్కరు ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Vakeel Saab' First Look: Pawan Kalyan is back and how; female characters  missing from poster

ఇక ఒకవైపు వకీల్ సాబ్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని కంప్లీట్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది మే లో విడుదల కావాల్సిన వకీల్ సాబ్ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే థియేటర్స్ ఓపెన్ అయి సినిమాల సందడి మొదలైంది. దాంతో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత దసరా పండుగ నుంచి వకీల్ సాబ్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా దిల్ రాజు పవర్ స్టార్ అభిమానులని సర్‌ప్రైజ్ చేయబోతున్నాడట.

జనవరి 1 2021 వకీల్ సాబ్ టీజర్ కి ముహూర్తం పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అంతేకాదు ఈ సినిమాను 2021 ఏప్రిల్ 9న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో దిల్ రాజు ఈ సినిమాని లెక్కకు మించి బడ్జెట్ ని కేటాయించాడు. ఇక ఈ సినిమా ఇండస్ట్రి వర్గాల తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా ని బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ లో అజిత్ చేసి భారీ సక్సస్ ని అందుకున్న సంగతి తెలిసిందే.