Pavan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో చాలా బిజీ గా వున్నారు.ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు అంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు అని సమాచారం.వచ్చే ఎన్నికల లోపు చేతిలో వున్నా సినిమాలు అన్ని పూర్తి చేసి ఎలక్షన్ ల హడావిడిలో ఉండాలని భావిస్తునట్టు సమాచారం.అందుకే వరుస సినిమాలు ఓకే చేసిన కరోనా కారణంగా సినిమాలు పూర్తి చేయడానికి ఆలస్యం అయింది.
వరుసలో చాలా సినిమాలు ఓకే చేయడం వలన ఎలక్షన్ సమయం కూడా దగ్గరలోనే ఉండటం తో కొన్ని సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉందట.ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వం లో వస్తున్న హరి హర వీరమళ్ళు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయాలి.దీని తర్వాత రామ్ తాళ్లూరి – సురేందర్ రెడ్డి సినిమా అనౌన్స్ చేశారు.ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా, భగవాన్ – దానయ్య నిర్మాణంలో ఓ సినిమా ఉంటుంది అన్నారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే ఇందులో కనీసం రెండు సినిమాలు పక్కకు పోతాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా మరో రెండు కొత్త కథలను ఓకే చేశారని వార్తలు వినిపిస్తున్నాయ్.తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వినోదాయ సీతాం’ అనే సినిమాను తెలుగులో తీయాలని చూస్తున్నారు. ఇది కాకుండా మరో సినిమా కూడా చర్చల్లో ఉంది అంటున్నారు. వేణు ఉడుగల దర్శకత్వంలో పవన్ నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఈ రెండు కొత్త ప్రాజెక్టలా గురించి ఆలోచిస్తుండటం తో ముందు ఒకే చేసిన సినిమాలలో ఆఖరున ఉన్న సినిమాల్లో ఒకటి ఆపాల్సిందే అంటున్నారు. అయితే అది సురేందర్ రెడ్డి సినిమానా? ఆ తర్వాతదా అనేది తెలియడం లేదు. చూడాలి మరి యే యే సినిమాలు పట్టాలు ఎక్కుతాయో, రాజకీయలను సినిమాలను ఎలా బాలన్స్ చేస్తారో చూడాలి మరి.