పట్టాలెక్కనున్న ఏం మయచేసావే 2… హీరోయిన్ ఎవరంటే..?

సమంత కి హీరోయిన్ గా కెరీర్ ఇచ్చిన సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఏం మాయ చేసావే . ప్రముఖ శని దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక ఈ సినిమాలో జెస్సి పాత్రలో నటించిన సమంత తన అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది . ఇలా మొదటి సినిమా ద్వారానే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో వలస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో నాగచైతన్య కూడా హీరోగా గుర్తింపు పొందాడు.

ఇలా ఈ సినిమా ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా సెటిల్ కాకుండా ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం కూడా చేసుకున్నారు. ఇలా ఈ సినిమా వీరిద్దరికి స్టార్డం తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమా కొంచం హిట్ అయినా చాలు దానికి సీక్వెల్ గా మరొక సినిమా తీస్తున్నారు. ఈ తరుణంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా కి సంబంధించిన సీక్వెల్ గురించి గతంలో చాలా వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి దర్శకుడు గౌతమ్ మేనన్ కూడా పాజిటివ్గా స్పందించాడు.

ఇక ఇటీవల ఏ మాయ చేసావే సినిమా తప్పకుండా తీస్తానని ఆయన ప్రకటించాడు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావే కి సీక్వెల్ కి సంబంధించిన స్టోరీ సిద్దమవుతోందని…ప్రస్తుతం పార్ట్ 2 కి స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీంతో తొందర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్ అనగానే అందరికీ ఒకే ఒక అనుమానం మొదలైంది. ఈ సీక్వెల్ లో నాగచైతన్య హీరోగా నటించినప్పటికీ సమంత అతని పక్కన నటించటానికి అంగీకరించదు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్న కి ఇప్పుడు సమాధానం దొరికింది. అందుతున్న సమాచారం ప్రకారం ఏ మాయ చేసావే సినిమా సీక్వెల్లో సమంత స్థానంలో రష్మిక హీరోయిన్ గా నాగచైతన్య పక్కన నటించనుందని సమాచారం.