మహేష్ సినిమాలో తప్పులు ఎత్తి చూపిన పరచూరి.. అలా చేయకపోతే అంటూ?

సూపర్ స్టార్ మహేష్  నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్. వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు కి ఈ సినిమా కూడా మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇటీవల ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని మార్పులు చేసి ఉంటే మరొక 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టేది అంటూ వ్యాఖ్యానించారు. పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాల గురించి తన అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సర్కారు వారి పాట సినిమాలోని కొన్ని తప్పుల్ని ఎత్తిచూపారు.

ఇటీవల పరుచూరి గోపాలకృష్ణ సర్కారు వారి పాట సినిమా గురించి మాట్లాడుతూ..’ఈ సినిమా మొదటి భాగంలో మహేశ్, కీర్తిల మధ్య సాగిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి అంటూ గోపాలకృష్ణ వెల్లడించాడు. అయితే.. అలా సరదాగా సాగుతున్న కథనం.. మహేష్ ఇండియాకి పయనం అవడంతో ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయింది. ఈ సినిమాలో ఇదొక ప్రమాదకరమైన మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా హాస్యాస్పదంగా సాగుతున్న కథనాన్ని హఠాత్తుగా సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లకుండా.. కీర్తి, మహేశ్ మధ్య ఇంకాసేపు సరదా సన్నివేశాలు కొనసాగించి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్టయ్యేదన్నారు. కామెడీతో పాటు సీరియస్ రొమాన్స్‌ని పొడిగించి ఉంటే.. ఈ చిత్రం మరో రూ. 100 కోట్లు కొల్లగొట్టేది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో ఎకండ్ ఆఫ్ లో హీరోకి – విలన్‌కి మధ్య జరిగే సన్నివేశాలనే ఎక్కువసేపు చూపించడంతో ప్రేక్షకులు చాలా బోర్ గా ఫీల్ అయ్యారు అంటూ ఆయన తెలిపారు. ఇలా సడెన్‌గా కథనం మార్పు చెందడం ఈ సినిమాకి కాస్త ప్రతికూలతగా మారిందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన, పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. తొందరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానంది. 11 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.