పాన్ ఇండియా స్థాయిలో కోక్ బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదల కాకముందు కేవలం సౌత్ ఇండస్ట్రీకి పరిమితమైన అల్లు అర్జున్ ఈ సినిమా విడుదలైన తర్వాత ఆల్ ఇండియా వైడ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఇది ఎలా ఉన్నారు సాధారణంగా సెలబ్రిటీలు నటిస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇలా బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలు కొన్ని ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

అయితే పుష్ప సినిమా విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఇప్పటికే పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు సినిమాలు మరోవైపు కమర్షియల్స్ యాడ్స్ తో హవా చూపిస్తున్నాడు. అయితే ‘పుష్ప’ సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిపోవడంతో ప్రముఖ కంపెనీలన్నీ ఇప్పుడు స్టైలిష్ స్టార్ వెంటపడుతున్నాయి. తాజాగా మరొక పాపులర్ సాప్ట్ డ్రింక్ కంపెనీ ‘కోక్’ తమ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ని నియమించుకున్నట్లు తెలుస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ కు బన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నడు.

ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ కంపనీకి సంబంధించిన యాడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉన్నారు. ఈ యాడ్ షూటింగ్ కి టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్, హరీష్ శంకర్ యాడ్ షూట్ పూర్తి చేసి ఈ నెల 19న వీరు ఇండియాకి తిరిగి రానున్నారని సమాచారం. ఇదివరకు గతంలో కోక్ కి నార్త్ ఇండియన్ హీరోలు బ్రాండ్ అంబాసిడర్లు గా ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఎవరు కోక్ బ్రాండ్ అంబాసిడర్ గా లేరు. కానీ ప్రస్తుతం బన్నీ దేశవ్యాప్తంగా కోక్ కి బ్రాండ్ అంబాసిడర్ నిలిచి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.