విశాల్ కాంట్రవర్సియల్ చిత్రానికి ఓటీటీ డేట్ లాక్..!

vishal

రీసెంట్ గా తమిళ సినిమా దగ్గర వచ్చి సూపర్ సక్సెస్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో హీరో విశాల్ మరియు నటుడు ఎస్ జె సూర్య కాంబినేషన్ లో తెరకెక్కించిన ఓ ఇంట్రెస్టింగ్ టైం ట్రావెల్ చిత్రం “మార్క్ ఆంటోని” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్ కూడా ఒక కీలక పాత్ర చేసాడు.

కాగా ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల అయ్యింది కానీ ఎందుకో తమిళ్ లో భారీ హిట్ అయ్యినప్పటికీ తెలుగు ఆడియెన్స్ మాత్రం ఈ గ్యాంగ్ స్టార్ టైం ట్రావెల్ డ్రామాకి మొహం చాటేశారు. కాగా ఈ చిత్రం విషయంలో అయితే విశాల్ పలు మార్లు కాంట్రవర్సీ కూడా ఎదుర్కొన్నాడు. హిందీ డబ్బింగ్ విషయంలో తనని లంచం అడిగారు అని తనకి జరిగిన అవమానాలు అవి పంచుకున్నాడు.

అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో అయితే ఓటిటి లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమాని ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకోగా అందులో ఈ అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడవచ్చు. మరి ఈ సినిమాకి ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు జివి ప్రకాష్ సంగీతం అందించగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. అలాగే వినోద్ కుమార్ నిర్మాణం వహించాడు.