ఓటిటి : ఈ స్ట్రీమింగ్ యాప్ లో వచ్చేసిన “పొలిమేర 2”

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర కంటెంట్ తో క్రేజీ హిట్స్ గా నిలిచిన చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో అయితే గత నవంబర్ లో వచ్చిన ఒక థ్రిల్లింగ్ బాల బస్టర్ హిట్ చిత్రం “పొలిమేర 2” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఓటిటిలో వచ్చి పెద్ద హిట్ అయ్యి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచిన “మా ఊరి పొలిమేర” కి సీక్వెల్ గా తెరకెక్కింది.

అప్పటివరకు కొన్ని కామెడి కొన్ని సీరియస్ పాత్రల్లో కనిపించిన నటుడు సత్యం రాజేష్ ని ఒక ఊహించని పాత్రలో దర్శకుడు అనీల్ విశ్వనాధ్ ప్రెజెంట్ చేయడం దానిని మించి ఓ క్రేజీ కథతో అందరినీ మెప్పించడంతో పార్ట్ 2 పై హైప్ బిల్డ్ అయ్యింది. దీనితో అదే ఊపులో థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమా భారీ లాభాలు అందించి పెద్ద హిట్ గా నిలిచింది.

ఇలా సక్సెస్ అయ్యిన ఈ సినిమా ఫైనల్ గా నేటి నుంచి డిజిటల్ గా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నిన్ననే వచ్చింది కానీ అది గోల్డ్ యూజర్స్ కి మాత్రమే వచ్చింది.

కానీ ఈరోజు నుంచి అయ్యితే ఫుల్ ఫ్లెడ్జ్ గా అందరికీ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. దీనితో ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రం తెలుగులో మాత్రమే ఆహాలో అందుబాటులో ఉంది. ఎవరైనా ట్రై చేస్తే ఇప్పుడు ట్రై చెయ్యండి.