HomeNews'ఆహా'...సూపర్ సక్సెస్ అయిన సందర్బంగా అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా సంబరాలు

‘ఆహా’…సూపర్ సక్సెస్ అయిన సందర్బంగా అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా సంబరాలు

 

On The Occasion Of Aha Super Success Organised A Grand Relieve Event
Aha Grand reveal event

మెగా నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 100 శాతం తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’.. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో సినిమాలు – వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కి పెడుతూ రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. డబ్బింగ్ సినిమాతో పాటు కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్దతిలో విడుదల చేస్తున్నారు. అలానే సరికొత్త వెబ్ సిరీస్ లతోనే కాకుండా స్పెషల్ టాక్ షోలతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే అక్కినేని సమంత వంటి స్టార్ హీరోయిన్ ని హోస్ట్ గా పెట్టి ‘సామ్ జామ్’ అనే షో చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ఆహా’ ప్రారంభమైన ఏడాది లోపే అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్ మరియు 5 మిలియన్ల డౌన్ లోడ్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో దీపావళి సంబరాలు చేశారు ‘ఆహా’ నిర్వాహకులు.

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయిన ఈ వేడుక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో అతిపెద్ద ఈవెంట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా కరోనా లాక్ డౌన్ తర్వాత ఇదే ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఈవెంట్ కూడా అవ్వడం విశేషం. ఈ కార్యక్రమానికి హీరో నవదీప్ – కమెడియన్ వైవా హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరించి షో ని సక్సెస్ చేశారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని ఈ ఈవెంట్ నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖులు తమన్నా,వంశీ పైడిపల్లి, నందిని రెడ్డి, దిల్ రాజుతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News