ఓటీటీ విడుదలకు సిద్ధమైన ఓకే ఒక జీవితం… ఎప్పుడు… ఎక్కడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శర్వానంద్ ఇటీవల “ఒకే ఒక జీవితం” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ కార్తీ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి , నాజర్ కీలకపాత్రలలో నటించారు.

సెప్టెంబర్ 9న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇటీవల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10 నుండి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ్ భాషలలో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఓటిటి లో విడుదల కానున్న ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. టైం ట్రావెల్ నేపథ్యంలో, మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల మదిని దోచింది.