సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినీ తారల పెళ్ళికి సంబంధించిన పెళ్ళి వార్తల మీద రక రకాల గాసిప్స్ వస్తుండటంతో ఇందులో నిజం లేదని అందరూ భావించారు. అందుకు కారణం గతంలో కూడ కాజల్ పెళ్ళి విషయంలో చాలా రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి.
అయితే ఈసారి మాత్రం దాదాపు ఈ వార్తలో నిజముందనే అనుకున్నారు. కాగా రీసెంట్ గా కాజల్ వివాహం చేసుకోబోయేది ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు అని వార్త వచ్చింది. కాని ఇందుకు సంబంధించి కాజల్ స్పందించలేదు. దాంతో ఇది కూడా రూమరే అని అనుకున్నారు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన పెళ్ళి విషయాన్ని అధికారకంగా ప్రకటించింది.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020
ఇక కాజల్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య, మంచు విష్ణు నటిస్తున్న ‘మోసగాళ్లు, ఆచార్య, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2’ తో పాటు బాలీవుడ్ లో ముంబై సాగా సినిమాల్లో నటిస్తోంది.