అఫీషియల్ : మెగాస్టార్ – బింబిసార దర్శకుడు కాంబోలో భారీ చిత్రం

నేడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే మెగాస్టార్ బర్త్ డే ని ఇప్పుడు జరుపుతున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ బ్లడ్ బ్యాంకు దగ్గర కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా..

ఇంకో పక్క మెగాస్టార్ నుంచి సరికొత్త ప్రాజెక్ట్ లు కూడా అనౌన్స్ కానున్నాయి. కాగా ఈ చిత్రాల్లో మెగాస్టార్ నుంచి స్ట్రైట్ సినిమాల కోసం ఫాన్స్ చూస్తుండగా వాటిలో యంగ్ దర్శకుడు వశిష్ఠ (“బింబిసార” చిత్రం ఫేమ్) తో ఓ సినిమా ఉంటుంది అని అది భారీ లెవెల్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే టాక్ ఉంది.

అయితే ఈ చిత్రం పై ఫైనల్ గా బిగ్గెస్ట్ అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు అందించారు. ఈ కాంబినేషన్ ఉంది అని ఫిక్స్ చేసి దర్శకుని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా డిజైన్ చేసి రిలీజ్ చేయగా ఇందులో పంచ భూతాల కలయికే తమ హీరో అన్నట్టుగా తెలిపారు.

దీనితో మళ్ళీ చాన్నాళ్ళకి మెగాస్టార్ నుంచి ఓ హై బడ్జెట్ మాసివ్ ఎంటర్టైనర్ రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ, రాధే శ్యామ్ సాహూ ఇప్పుడు సూర్య తో కంగువా లాంటి భారీ చిత్రాలు నిర్మాణం వహిస్తున్న యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రానున్న రోజుల్లో సినిమాపై మరిన్ని వివరాలు బయటకి రానున్నాయి. అన్నట్టు ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో 157వ సినిమాగా తెరకెక్కుతుంది.