కొరటాల శివని మరీ గుడ్డిగా నమ్మేస్తున్నారేమో.!

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ తదితర సినిమాలు తెరకెక్కించిన కొరటాల శివ ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు. ‘ఎన్టీయార్ 30’ సినిమా విషయంలో యంగ్ టైగర్ అభిమానులు మరీ గుడ్డిగా నమ్మేస్తున్నారు కొరటాల శివని. రాజమౌళి కంటే గొప్పోడంటూ సోషల్ మీడియాలో కొరటాల శివ గురించి జూనియర్ ఎన్టీయార్ అభిమానులు పేర్కొంటుండడం అతనిపై భారాన్ని పెంచడమే.

అసలే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ నుంచి వస్తోన్న సినిమా.! ఆ యాంగిల్‌లో చూసినా, అభిమానుల నుంచి ఒత్తిడి కాస్త తక్కువగా వుంటే కొరటాలకు మంచిది. అతని నుంచి బెస్ట్ ఔట్‌పుట్ రావడానికి ఛాన్స్ వుంటుంది.

కానీ, అభిమానులు ఆగడంలేదు. దాంతో, ఎన్టీయార్ అసహనానికి గురవుతున్నాడట. ఇప్పటికే అభిమానుల్ని ఉద్దేశించి పలు సందర్భాల్లో పలు విధాలుగా ఎన్టీయార్ స్పందించాడు.

కొరటాలపై ఒత్తిడి భారం తగ్గించేలా మరోసారి అభిమానుల్ని ఉద్దేశించి త్వరలో ఓ ప్రకటన ఎన్టీయార్ ఈ విషయమై చేయబోతున్నాడని సమాచారమ్. చూడాలి మరి, ఆ తర్వాతైనా అభిమానులు ఈ ‘అతి’ తగ్గించుకుంటారేమో.!