సూర్య దమ్మేంటో చూపించాడు.. ఇక అందరూ క్యూ కడతారట ..?

గత కొన్ని నెలలుగా కరోనా తో థియోటర్స్ మూతపడి రిలీజ్ కి ఉన్న అన్ని భాషల సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కాగా ఇలా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకొని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ముందు తన భార్య జ్యోతిక నటించిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి థియోటర్స్ యాజమాన్యం నుంచి సమస్యలు ఎదురయ్యాయి. ఓటీటీలో గనక సినిమాలు రిలీజ్ చేస్తే సూర్య సినిమాలతో పాటు కార్తి సినిమాలని ఇక థియోటర్స్ ద్వారా రిలీజ్ చేయమని తేల్చి చెప్పారు.

Aakasam Nee Haddura Review | Aakasam Nee Haddura Telugu Review

అయినా సూర్య ఏమాత్రం ఈ బెదిరింపులకి లొంగ లేదు. కాగా ఇప్పటి వరకు ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజైనప్పటికి మంచి హిట్ అన్న పేరు మాత్రం తెచ్చుకున్న సినిమాలేదు. కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు, నాని, సుధీర్ బాబు నటించిన వి, అనుష్క నటించిన నిశ్శబ్ధం.. ఇలా పెద్ద సినిమాలే రిలీజయ్యాయి. కాని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే సూర్య నటించిన సూరారై పోట్రు అన్న సినిమా తెలుగులోనూ ఆకాశం నీ హద్దురా అన్న టైటిల్ తో డబ్ అయి తాజాగా రిలీజ్ చేశారు.

ఇప్పటికి వరకు ఓటీటీలో రిలీజైన సినిమాలలో ఈ సినిమా భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు నిన్నా మొన్నటి వరకు మా సినిమాలు ఎంత ఆలస్యం అయినా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని పట్టుదలతో కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు మంచి ఆఫర్ వస్తే తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మొత్తానికి సూర్య తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసి భారీ సక్సస్ ని అందుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సినిమా కి తమిళం తో పాటు తెలుగులో మంచి ఆదరణ దక్కుతోంది. ఇక ఈ సినిమాలో మంచి మోహన్ బాబు కూడా నటుంచారు.